Wednesday, May 7, 2025
- Advertisement -

సంకీర్ణం కరెక్టే..పవన్ కోరిక నెరవేరుతుందా?

- Advertisement -

జనసేనాని పవన్ కళ్యాణ్‌ వారాహి యాత్రలో చేసిన కామెంట్స్ ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. వచ్చేది సంకీర్ఱ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు పవన్. అయితే పవన్ చేసిన వ్యాఖ్యల వెనుక మాస్టర్ స్కెచ్ ఉందని జనసైనికుల వాదన.

ఒక్కసారి సీఎం కావాలన్నది పవన్ కల. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీని నెంబర్‌ 1గా తీర్చిదిద్దుతానని పవన్ పలుమార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ చేసిన సంకీర్ఱ సర్కార్ కామెంట్స్ వెనుక కూడా ముఖ్యమంత్రి తానేనని చెప్పకనే చెప్పారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేన టీడీపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పిన పవన్ తాసు సీఎం రేసులో ఉన్నానని టీడీపీ నేతలకు హింట్ ఇచ్చారనే చెప్పాలి.

ఇక పవన్ సీఎం కావాలంటే కనీసం 60కి పైగా స్ధానాల్లో జనసేన పోటీచేసి ఇందులో మెజార్టీ స్ధానాల్లో గెలుపొందాలి. అప్పుడు పవన్‌ కోరిక నెరవేరుతుంది. అయితే ఒకవేళ టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే చెరో రెండున్నర సంవత్సరాలు అధికారాన్ని పంచుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే జగన్ సర్కార్‌ పై ప్రజల్లో అంత వ్యతిరేకత లేకపోవడంతో పవన్ ఆశ నెరవేరుతుందా లేదా చూడాలి..

అయితే టీడీపీ నాలుగు దశాబ్దాల చరిత్రలో అనేక పార్టీలతో పొత్తులను పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. అయితే ఎవరితోనూ అధికారాన్ని షేర్ చేసుకోలేదు. మరో వైపు చూస్తే చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత జగన్‌పై కోపం మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఒకవేళ అధికారంలోకి వస్తే పవన్‌కు ఛాన్స్‌ ఇచ్చేది కష్టమే. ఏది ఏమైనా కూడా పవన్ నోట సంకీర్ణ ప్రభుత్వం అన్న మాట చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -