రాజమండ్రి జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పొత్తులపై కీలక ప్రకటన చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. అవినీతి వైసీపీ సర్కార్‌ను గద్దె దించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే పొత్తు అనివార్యమని తేల్చిచెప్పారు. ఇక తమతో పాటు బీజేపీ కూడా కలిసివస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు పవన్. దీంతో చంద్రబాబుతో పవన్ ములాఖత్ తర్వాత ఏపీ రాజకీయాల్లో వేగంగా మర్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఇక ఇదే సమమంలో హస్తినకు వెళ్లనున్నారు జనసేన అధినేత పవన్. మోడీ నేతృత్యంలోనే ఎన్డీఏ సర్కార్ కూటమిలో ఉన్నారు పవన్. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తుపై పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వాస్తవానికి టీడీపీ – బీజేపీని కలిపే బాధ్యతను ఇప్పటికే భుజాన వేసుకున్నారు పవన్. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. త్వరలోనే బీజేపీ- టీడీపీ-జనసేన పొత్తుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుందని భావించిన తరుణంలో చంద్రబాబు అరెస్ట్‌తో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. బాబు అరెస్ట్ తర్వాత బీజేపీ పెద్దగగా పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఈ నేపథ్యంలోనే పవన్…కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో అపాయిట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అపాయిట్మెంట్ ఇస్తే అమిత్ షా తో లేదంటే బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యే అవకాశాలున్నాయట. ఈ భేటీలో చంద్రబాబు అరెస్టు, టీడీపీతో పొత్తు విషయం పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ పార్టీ …టీడీపీతో పొత్తుకు ఒప్పుకోకపోతే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకునేందుకు రెడీ అయ్యారట పవన్. ఈ నేపథ్యంలో పవన్ హస్తినకు వెళ్తున్నారనే వార్త రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.