Thursday, May 8, 2025
- Advertisement -

క్రాస్ రోడ్డులో పవన్..ఎప్పుడు సెట్‌ అవుతాడో?

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని భావించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు కోలుకోలేని విధంగా షాక్ తగిలింది. తెలంగాణ ఎన్నికల్లో చతికిలపడటంతో ఆ ప్రభావం ఏపీపై పడింది. వాస్తవానికి 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన బల పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే స్వయంగా చంద్రబాబే…పవన్‌ కోసం స్నేహ అస్తం చాటాడంటే అర్ధం చేసుకోవచ్చు.

ఇక టీడీపీ – జనసేన కలయికతో ఆ పార్టీ శ్రేణుల్లో కాస్త ధైర్యం వచ్చిన పవన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా ఇప్పుడు జనసేనాని క్రాస్ రోడ్డులో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక 2019లో పవన్ రెండు చోట్ల ఓడిపోయి జనసేన కేవలం ఒక్క సీటు గెలిచినా అప్పుడు వచ్చిన విమర్శలను లైట్ తీసుకున్నారు పవన్. కానీ ఇప్పుడు పవన్‌పై జరుగుతున్న ముప్పేటా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ రెండు పార్టీలతో వేర్వేరుగా దోస్తి కట్టడం బహుశా ఇదే తొలిసారేమో. ఎందుకంటే ఏపీలో ఇట టీడీపీతో అటు బీజేపీతో జట్టు కట్టారు పవన్. కానీ టీడీపీ – బీజేపీ మాత్రం పొత్తు అంటే పెదవి విరిచే పరిస్థితి నెలకొంది. ప్యాకేజీ కోసమే రెండు పార్టీలతో పొత్తు కొనసాగిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో జనసేన పోటీ ఖచ్చితంగా పవన్ తీసుకున్న అనాలోచిత చర్యే. అదే ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ పవన్‌కు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. మరి ఈ పొలిటికల్ క్రైసిస్ నుండి పవన్ ఎలా గట్టెక్కుతారో వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -