Thursday, May 8, 2025
- Advertisement -

బీజేపీని వదిలించుకునేందుకే పవన్ ఇలా చేస్తున్నారా?

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇందులో పవన్‌ సంగతి సరాసరే. పవన్ మైండ్‌సెట్ ఎప్పుడు ఎలా మారుతుందో జనసైనికులకే కాదు ఓ మాటకొస్తే ఆయనకే అర్ధంకాని పరిస్ధితి. పూనకాలు లోడింగ్ అన్నట్లు ప్రజలను చూడగానే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఓసారి ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చానని మరోవైపు ఎన్డీయేలోనే ఉన్నానని చెబుతుండటం పవన్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని పలువురు చెబుతున్న పరిస్థితి నెలకొంది.

అయితే పవన్ సంగతేమో కానీ ఆయన్ని నమ్ముకున్న జాతీయ పార్టీ బీజేపీ సిచ్యువేషన్ అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. జనసేనతో కలిసి పోటీచేసేందుకు టీడీపీ అడ్డంకి…అలా అని టీడీపీ ఉన్న కూటమిలో చేరితే ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇలా ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు బీజేపీ నేతలు.

వాస్తవానికి ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది బీజేపీకి రాంరాం చెప్పేందుకే సిద్ధమయ్యారు పవన్. సరైన సమయం కోసం ఎదురుచూస్తుండగా చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ రూపంలో కాలం కలిసివచ్చింది. అంతే తాను అనుకున్న ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసేశారు. క్షణం ఆలోచన చేయకుండా టీడీపీతో పొత్తు ప్రకటించి, వెంటవెంటనే సీట్ల పొత్తు, మేనిఫెస్టో తయారు దాకా వెళ్లారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎటు కాకుండాపోయింది బీజేపీనే.

పవన్ రాజకీయ ఎత్తుగడలో ఓ రీజన్ ఉంది. ఎందుకంటే బీజేపీకి సొంతబలమంటు ఏమీలేదు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి. గత ఎన్నికల్లో పోటీచేసిన ఒక్క బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 0.56 కాగా నోటాకి 3 శాతం ఓట్లు వచ్చాయి. అంటే నోటా కన్నా బీజేపీ తీసి పోయినట్లు అర్ధమైంది. అందుకే పవన్‌నే నమ్ముకుని ఇప్పటివరకు ముందుకుసాగారు. కానీ తీరా ఎన్నికల సమయం వచ్చే సరికి పువ్వుపార్టీని పువ్వే చేసేశారు పవన్. జనసేనను పట్టుకుని పది ఓట్లు తెచ్చుకోవాలని ఆశపడ్డ కమలనాథులకు పవన్ వేసిన దెబ్బతో మాములు షాక్ తగలలేదు. ఎంతలా అంటే పోటీ చేయాలా వద్దా అనే పరిస్థితికి వచ్చారు. మొత్తంగా బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని పొలిటికల్ క్రైసిస్‌ని చూడాల్సిన పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -