Sunday, May 19, 2024
- Advertisement -

షూటింగ్‌లకు ప్యాకప్ చెప్పిన పవన్?

- Advertisement -

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షూటింగ్‌లకు ప్యాకప్ చెప్పేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు బయటకు రావడంతో ఇకపై యాక్టివ్ పాలిటిక్స్‌లో బిజీ కానున్నారు పవన్. ఓ వైపు తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30న జరగనుండగా ఏపీలో షెడ్యూల్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

దీంతో చంద్రబాబు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌పై ఉండనుండటంతో రాజకీయ వ్యూహాలను ఈ టైంలోనే సిద్ధం చేయనున్నారట. ఈ నేపథ్యంలో ఎన్నికలు అయిపోయే వరకు షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీతో పాటు జనసేనకు ఈ ఎన్నికలు ఎంతో కీలకం. అందుకే ఈసారి వైసీపీని ఎదుర్కొనేందుకు ఈ రెండు పార్టీలు గట్టి ప్రణాళికతో ముందుకు రావాలని భావిస్తున్నాయి.

అందుకే సీట్ల సర్దుబాటు దగ్గరి నుండి ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టో వంటి అంశాలపై ఓ కీలక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే తెలంగాణలో పవన్ బీజేపీతో జట్టు కట్టడంతో అక్కడ పోటీ చేసే స్ధానాలు, ప్రచారంపై కూడా పవన్ ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అయితే రాజకీయంగా పవన్ ఫుల్ యాక్టివ్ కావడంతో ఆయన సినిమాలు మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇది పవన్ ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగించే అంశంమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -