Sunday, May 11, 2025
- Advertisement -

పవన్…బై బై బాబు!

- Advertisement -

2019 ఎన్నికల్లో ప్రధానంగా వినిపించిన నినాదం ఇది. రావాలి జగన్..కావాలి జగన్‌ అనే నినాదం ఒకవైపు అయితే మరోవైపు ‘బై బై బాబు’ అనే స్లోగన్ మార్మోగిపోయింది. జగన్ ప్రభంజనం ముందు టీడీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక ఇప్పుడు బై బై బాబు అని అప్పుడు ఎందుకు అన్నారో జనసేన పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు అర్ధమైంది.

పొత్తు పేరుతో ఒంటెద్దుపొకడలకు చంద్రబాబు పోతుండటంతో పవన్‌ తనదారి తాను చూసుకునేందుకు సిద్ధమయ్యారు. రిపబ్లిక్ డే రోజు న ఒక్కసారిగా బాంబు పేల్చారు పవన్. ఇన్ని రోజులు ఎన్ని అవమానాలు జరిగినా ఓపిక పడుతూ వస్తున్న పవన్‌…ఒక్కసారిగా రెచ్చిపోయారు. చంద్రబాబుకు బహిరంగంగానే ఝలక్ ఇచ్చారు. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించడం లేదని చెబుతూనే రెండు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు.

ఇక పవన్‌ నుండి ఇదే కోరుకున్నారు జనసైనికులు. ఎందుకంటే టీడీపీని నమ్ముకుంటే లాభం లేదని పవన్‌కు ఎన్నోసార్లు చెప్పారు. అయితే పవన్ మాత్రం చంద్రబాబు మత్తులో జనసైనికులపైనే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. ఒకానొక దశలో టీడీపీతో పొత్తు వ్యవహారం పై ఇష్టం లేని వారు పార్టీని వీడి వెళ్ళిపోవచ్చని హుకుం కూడా జారీ చేశారు.

అయితే లేటుగానైనా పవన్ కళ్లు తెరవడంతో జనసైనికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అవసరమైతే టీడీపితో తెగతెంపులు చేసుకుని బిజేపితో కలిసి పవన్ పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని జనసేన నేతలు చెబుతున్నారు. మొత్తంగా గణతంత్ర దినోత్సవ వేళ పవన్ పేల్చిన బాంబ్‌తో చంద్రబాబుకు మాస్టర్ స్ట్రోక్ తగిలిందని పలువురు వాపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -