వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేయాలనే దానిపై క్లారిటీ ఇచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. తాను పీఠాపురం నుండే పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని, కానీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఎంపీగా పోటీ చేస్తే కొన్ని సమస్యలున్నాయని, క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉండటంతో త్వరలోనే ఎంపీగా పోటీపై క్లారిటీ వస్తుందన్నారు.
వాస్తవానికి భీమవరం, గాజువాక నుండి పోటీ చేద్దామని అనుకున్నా కానీ ఈసారి పీఠాపురం నుండి బరిలో ఉంటున్నానని చెప్పారు. ఎట్టకేలకు తాను ఎక్కడి నుండి పోటీ చేస్తాననే దానిపై పవన్ స్వయంగా ప్రకటించడంతో ఇంతకాలం నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది.
2019లో భీమవరం, గాజువాక రెండు స్థానాల నుండి పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోగా ఆ తర్వాత ఈ నియోజకవర్గాల్లో పర్యటించలేదు. అంతేగాదు కనీసం స్థానిక సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో కొత్త నియోజకవర్గం పీఠాపురాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ తరపున వంగ గీత బరిలో ఉన్నారు. స్థానికంగా ఆమెకు మంచి పేరు ఉండటంతో పవన్ టఫ్ ఫైట్ ఎదుర్కొవడం ఖాయంగా కనిపిస్తోంది.