మేనిఫెస్టో అంటే ఏ పార్టీకైనా భగవద్గీత,ఖురాన్,బైబిల్‌తో సమానం. ఎన్నికల్లో హామీ ఇస్తే వాటిని నెరవేర్చే సంకల్పం,చిత్తశుద్ది ఉండాలి. హామీ ఇస్తే వాటిని నెరవేర్చేందుకు ఎంత కష్టమైనా భరించాలి. ఇదే నవరత్నాల పేరుతో 2019లో హామీ ఇచ్చిన జగన్ 99 శాతం నెరవేర్చి ప్రజల మనసు గెలుచుకున్నారు. ఆచరణ సాధ్యం అయ్యే హామీలనే ఇచ్చి ప్రజలకు ఏం చేయగలుగుతామో చెప్పారు.
కానీ మరోవైపు అధికారమే పరమావధిగా చంద్రబాబు అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. సూపర్ సిక్స్ పేరుతో అసలు సామాన్య ప్రజలకు అనుమానం వచ్చేలా మేనిఫెస్టోను రూపొందించి ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు రెడీ అయ్యారు. మొదటినుంచీ చంద్రబాబు తీరే అంత … కంచం నిండా పెట్టినట్లు ప్రచారం చేస్తారు..చివరకు చేతిలో చిటికెడు దులిపేసి..నీకు ఇది ఇవ్వడమే ఎక్కువ అని తప్పించుకుంటారు… గత ముప్పయ్యేళ్లుగా చంద్రబాబు వ్యవహారశైలిని చూసినవాళ్లకు ఇది స్పష్టంగా తెలుసు… ఇక ఇప్పుడు మ్యానిఫెస్టో విషయంలో కూడా అదే చేస్తారన్నది ప్రజలకు గుర్తుంది.. అందుకే అయన మ్యానిఫెస్టోను సైతం పెద్దగా పట్టించుకోకుండా….ఓస్..ఇంతేనా అని పెదవివిరుస్తున్నారు. ఇవ్వనిదానికి ఎన్ని చెబితే ఏమిలాభం అనేది ప్రజల అభిప్రాయంగా ఉంది.
ఇక ముఖ్యమైన పెన్షన్ విషయానికి వస్తే ఏప్రిల్ నుంచి పింఛన్ 4000 కి పెంచి ఏప్రిల్, మే,జూన్ 3 నెలల ఎరియర్స్ కలిపి (4000+1000+1000+1000= 7000) ఇస్తా అన్నాడు.అంటే జులై 1st న 65 లక్షల మందికి 7000 చొప్పున పింఛన్ ఇవ్వాలి.అంటే జులైలో ఒక్క పింఛన్ కోసమే సుమారు రూ. 5000 కోట్లు కావాలి.
వాస్తవానికి 2018 లో కేవలం 39 లక్షలకి మాత్రమే పించన్ అందేది. కానీ ప్రస్తుతం 65 లక్షల మందికి పైగా పింఛన్ ఇస్తున్నారు.అంటే ఫించన్ లబ్ధిదారుల సంఖ్య దాదాపు డబుల్ అయింది…. 2018 అక్టోబర్ లో పింఛన్ కోసం నెలకి 400 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం…..ఫించన్ అమౌంట్ గనుక 4000 కి పెంచితే నెలకు రూ. 3000 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది… ఇప్పటికే రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారు అని చెబుతున్న చంద్రబాబు..ఇప్పుడు అంత డబ్బు ఎలా సమకూరుస్తారు.
ప్రస్తుతం సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం ఇంటర్ వరకూ చదివే పిల్లలకు ఏటా రూ. 15000 అమ్మఒడి కింద అందజేస్తున్నారు. దీనికి ఏటా 44 . 50
లక్షలమందికి రూ. 26067 కోట్లు అందజేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు తల్లికి వందనం పేరిట ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటె అంతమందికి ఏటా రూ. ఇరవై వేలు ఇస్తామని ప్రకటించారు. అలా ఇస్తే 65 లక్షలమందికి ఇవ్వాల్సి ఉంటుంది… దీనికి ఐదేళ్ళలో రూ. 52000 కోట్లు ఖర్చవుతుంది… అంత బడ్జట్ ఉందా ? చంద్రబాబు ఈ పథకం నిజంగా అమలు చేస్తారా ? చంద్రబాబు ఇచ్చే హామీలు అమలుకు ఏటా రూ. 121619 కోట్లు ఖర్చు అవుతుంది… నిజంగా అది అమలు సాధ్యమేనా? అయన మాట మీద నిలబడి ఇవన్నీ అమలు చేస్తారా ? ప్రజలారా ఆలోచించండి