మంత్రి నారా లోకేష్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి,వైసీపీ నేత పేర్ని నాని. మీడియాతో మాట్లాడిన నాని..16 నెలలు జైలులో పెట్టినా జగన్ తగ్గలేదని…ఎన్నికల్లో ఓడిపోతే తగ్గుతాడా? ఆలోచించాలన్నారు. జగన్ కోసం 986 మందితో భదత్ర, వందల కోట్లు దుబారా అని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్యాలెస్ ప్యాలెస్ అంటున్న మంత్రి లోకేశ్ హైదరాబాద్ లో తన ఇంటి వీడియోలు చూపించగలడా..? అని ప్రశ్నించారు. జగన్ ది ప్యాలెస్ అయితే మీది రాజమహల్.. ఏదీ తేల్చకుండా కావాలనే పెండింగ్ పెట్టి విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
జగన్ దమ్మున్న నాయకుడు అని…మళ్ళీ గెలిచే వరకూ తాడేపల్లి నుండే జగన్ పోరాడతాడన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద పార్టీల్లో 5వ స్థానంలో వైసీపీ ఉందని… మా పార్టీ ఆఫీసులు, మీ పార్టీ ఆఫీసుల కేటాయింపులపై లీగల్ టీమ్స్ తో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పసుపు రంగు ఏమైనా టీడీపీకి పేటెంటా? బందర్ లో తప్ప ఇంకెక్కడా నాకు, నా కుటుంబ సభ్యులకు కానీ ఒక్క ఇల్లు లేదు అని చెప్పారు.