Saturday, May 3, 2025
- Advertisement -

స్పీకర్ రేసు..తెలుగు వారికి ఛాన్స్ దక్కేనా?

- Advertisement -

ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి లోక్ సభ స్పీకర్ ఎవరు అవుతారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుండి లోక్ సభ స్పీకర్‌గా ఇప్పటివరకు బాలయోగి మాత్రమే చేయగా ఇప్పుడు ఆ అవకాశం వస్తుందని అంతా భావిస్తున్నారు.

ఎందుకంటే బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో టీడీపీకే ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్నాయి. దీంతో స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. గతంలో టీడీపీకి చెందిన దివంగత నేత జీఎంసీ బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించారు. అయితే ఈసారి కూడా టీడీపీకే స్పీకర్ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతున్న ప్రధానంగా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

మూడుసార్లు ఎంపీగా గెలిచిన పురందేశ్వరి… కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 2014లో బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో బీజేపీకి 3 ఎంపీ,8 ఎమ్మెల్యే స్థానాలు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఎన్డీయే మూడోసారి అధికారంలోకి రావడంతో పురందేశ్వరికి కేంద్రమంత్రి పదవి దక్కుతుందని అంతా భావించినా అలాంటిదేమీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఆమెకు స్పీకర్ పదవి కట్టబెడతారని చర్చ జరుగుతోంది. అందుకే పురందేశ్వరిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోలేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మొత్తంగా 26న స్పీకర్ ఎన్నిక జరగనుండగా తెలుగు రాష్ట్రాల నుండి ప్రధానంగా ఏపీకి ఆ అవకాశం దక్కుతుందని అంతా భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -