ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు రఘురామ కృష్ణంరాజు. రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ తెలిపారు. అనంతరం డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు స్వీకరించగా ఆయన్ని మర్యాదపూర్వకంగా పోడియం వద్దకు తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, విష్ణుకుమార్ రాజు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి తీసిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు.. నాటు’ పాట ఎంత పాపులర్ అయ్యిందో రఘురామకృష్ణరాజు నిర్వహించిన రచ్చబండ ప్రోగ్రాం కూడా రాజకీయాల్లో అంతటి పాపులర్ అయ్యిందని చెప్పారు. రఘురామకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని… పంచెకట్టులో రఘురామ కృష్ణరాజు వచ్చి స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారని అన్నారు.
అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలిలో చీఫ్‌విప్‌గా పంచుమర్తి అనురాధను నియమించిన సంగతి తెలిసిందే.