Sunday, May 4, 2025
- Advertisement -

వైఎస్‌ నుండి ఎంతో నేర్చుకున్నా!

- Advertisement -

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నుంచి తాను వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నానని.. భారత్‌ జోడో యాత్రకు రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్రే స్ఫూర్తి అని వెల్లడించారు.

నాడు రాజశేఖర్‌రెడ్డి ఎండను, వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశారని …ఆయన స్ఫూర్తితోనే భారత్‌ జోడో యాత్రలో ముందుకు సాగానని వెల్లడించారు. ఈ మేరకు వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్‌ వేదికగా వీడియో రిలీజ్‌ చేశారు.

ప్రజానీకానికి ఆయన నిజమైన నాయకుడు. ఎప్పుడూ ప్రజల కోసమే బతికిన నేత. ఏపీ, భారతదేశ ప్రజల అభ్యున్నతి, సాధికారత పట్ల ఆయన చూపిన అంకితభావం, నిబద్ధత ఎంతో మందికి మార్గదర్శకం అని కొనియాడారు. వైఎస్ బతికే ఉంటే ఏపీ ముఖచిత్రం వేరేలా ఉండేదన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -