- Advertisement -

మహానేత దూరమై 15 ఏళ్లు..జగన్ ఘననివాళి

- Advertisement -

దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి భౌతికంగా దూర‌మై 15 ఏళ్లు గడుస్తోంది. అయినా ఆ జ్ఞాప‌కాలు చెరిగిపోలేదు. ఆ రూపం చెదిరిపోలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఎప్పటికి గుర్తుండిపోతారు వైఎస్. ఇవాళ ఆయన 15వ వర్దంతి సందర్భంగా ఇడుపుల పాయలో ఘన నివాళి అర్పించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. వైఎస్ విజయమ్మ, భారతితోపాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు రాజశేఖర్ రెడ్డి. పేద ప్ర‌జ‌ల క‌ష్టాల్ని విన‌టానికి క‌డ‌ప గ‌డ‌ప దాటి ప్ర‌జాయాత్ర ని పాద‌యాత్ర గా ప్రారంభించిన వైఎస్… జ‌న‌నేత‌గా , మ‌హ‌నేత‌గా పేద ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడుగా నిలిచారు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి తేవడమే కాదు కేంద్రంలోని యూపీఏ 1, యూపీఏ2లో కీలక పాత్ర పోషించారు.

వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగులో జయమ్మ,రాజారెడ్డి దంపతులకు జన్మించారు రాజశేఖర్ రెడ్డి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టారు.6 సార్లు పులివెందుల నుండి ఎమ్మెల్యేగా 4 సార్లు కడప నుండి ఎంపీగా గెలిచారు.

అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఫైల్‌పై తొలి సంతకం చేస్తానని చెప్పి చెప్పినట్లుగానే చేసి రైతన్నల మనసు గెలుచుకున్నారు. సెప్టెంబర్ 2, 2009 న రచ్చబండ కార్యక్రమానికి వెళ్తు చిత్తూరు జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -