- Advertisement -
దక్షిణాది ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన రకుల్…దేదే ప్యార్ దే 2లో నటిస్తోంది. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.
అజయ్ దేవగన్, టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా పాటియాలాలో షూటింగ్ జరుపుకుంటోంది అ చిత్రం. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. దర్శకుడు అన్షుల్ శర్మ అనారోగ్యానికి గురి కావడంతో సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
శర్మకు డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అయిందని దీంతో ఓ నెల రోజుల పాటు షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. నవంబర్‌లో చిత్రీకరణ తిరిగి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.