అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 4 గ్లోబల్ సూపర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ఎపిసోడ్ ప్రేక్షకులను మరపురాని ప్రయాణంలో తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఎపిసోడ్ ప్రోమో ఇప్పటికే అభిమానులలో సంచలనం సృష్టించింది, ఇది సీజన్‌లో హైలీ యాంటిసిపేటెడ్ ఎపిసోడ్‌లలో ఒకటిగా నిలిచింది.
సంక్రాంతి వేడుకల నేపధ్యంలో చిత్రీకరించబడిన ఈ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చింది. 2025లో గ్రాండ్ సన్ కావాలనే కోరికను పంచుకున్న అమ్మమ్మ అంజనా దేవి, తల్లి సురేఖ కొణిదెల వీడియో సందేశం ఆకట్టుకుంది. తన కుమార్తె వీడియో చూసి రామ్ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు.
రామ్ చరణ్ తన కుమార్తె అందమైన కథలు పంచుకుంటూ తండ్రిగా తన జీవితం గురించి, ఆమె ఇప్పటికే అతనిని తన కాలి మీద ఎలా ఉంచుతోందో తెలియజేశారు. ఆమెకు తినిపించడం నుండి పరిగెత్తడం వరకు, చరణ్ తన మధురమైన క్షణాలు పంచుకున్నారు. తన ప్రియమైన పెంపుడు జంతువు రైమ్ కొణిదెలను పరిచయం చేశారు. రామ్ చరణ్ ప్రాణ స్నేహితుడు హీరో శర్వానంద్ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కనిపించారు. ఈ ఎపిసోడ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌తో హిలేరియస్ ఫోన్ కాల్ కూడా ఉంది.నిర్మాత దిల్ రాజు ఎపిసోడ్ సందడి చేశారు.