ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. హామీ ఇచ్చిన ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ఏమైందంటూ సూటిగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అమలు చేశారని, మీరు ఎందుకు చేయలేకపోతున్నారని చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చారు.
మహిళలకు ఉచిత ఆర్టీసీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో విజయవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట మీద నిలబడి అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే మహిళలకు ఫ్రీగా ఆర్టీసీలో ప్రయాణించే సదుపాయం కల్పించారని గుర్తు చేశారు.
రెండు రోజుల్లో రేవంత్ ఇలాంటి మంచి పథకాన్ని అమలు చేసి చూపించారు…. ఏపీలో బాబు మాత్రం హామీని పట్ల నెరవేర్చే లాగా కనిపించడం లేదు అని ప్రశ్నించారు షర్మిల. కనీసం ఈ పథకం గురించి మాట కూడా ఎత్తడం లేదు… ఈ స్కీమ్ ను త్వరగా అమలు చేయాలి అని ప్రశ్నించారు.