వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారం అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే పదవి కొల్పోగా మరోవైపు టీడీపీలో చేరిన వైసీపీ రెబల్స్‌కు ఆ పార్టీకి నుండి అసమ్మతి పోటు ఎదురవుతోంది.
ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రీసెంట్‌గా టీడీపీలో చేరగా మైలవరం ఇంచార్జిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. అయితే దేవినేనిని పెనమలూరుకు పంపుతారని ప్రచారం జరుగుతండగా మైలవరం టికెట్‌ను ఆశీస్తున్నారు బొమ్మసాని సుబ్బారావు. వైసీపీ నుండి టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ కు టికెట్ ఇస్తే ఆయనకు అనుకూలంగా పనిచేయమని తేల్చిచెప్పారు. స్వయంగా వసంత నాగేశ్వరరావు తన ఇంటికి వెళ్లి బ్రతిలాడిన బొమ్మసాని తిరస్కరించారు.
ఇక పెనమలూరులోనూ ఇదే పరిస్థితి. వైసీపీ నుండి టీడీపీలో చేరిన పార్థసారథికి సహకరించేందుకు స్థానిక టీడీపీ నేతలు నిరాకరిస్తున్నారు. పెనమలూరు టికెట్‌ను పార్ధసారథికి ఇస్తే ఊరుకునే పరిస్థితి లేదని బోడే ప్రసాద్ హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ నుండి టీడీపీలో చేరిన మిగితా ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే ఉండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారనే టాక్ నడుస్తోంది.