తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వుతో తయారు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు మొదటి నుండి చెబుతున్నట్లుగా, టీటీడీ ఈవో పలు మార్లు లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పిన టీడీపీ బ్యాచ్ పదే పదే వైసీపీని టార్గెట్ చేస్తూ బురద చల్లాయి. ఇక చంద్రబాబు దత్తపుత్రుడు సంగతి సరేసరి. తిరుపతి లడ్డూకు, సనాతన ధర్మానికి ముడి పెడుతూ తెగ హడావిడి చేశారు. తీరా సుప్రీం కోర్టు ప్రశ్నించే సరికి తెల్లమొహాలు వేశారు.
జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారయ్యాయి అనడానికి ఆధారాలున్నాయా?, క్రాస్ చెక్ ఎందుకు చేయలేదు?, స్వయంగా టీడీపీ ఈవోనే లడ్డూల తయారీలో వాడలేదని చెప్పిన ఓ బాధ్యత కలిగిన సీఎం ఎలాంటి ఆధారాలతో మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు.
ఇక ఇవాళ చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్‌ను కాదని స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది. సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర విచారణ జరపాలని తెలిపింది. ఇందుకోసం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు కేంద్ర అధికారులు, ఇద్దరు ఏపీకి చెందిన అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి దర్యాప్తు చేస్తారని తెలిపింది న్యాయస్థానం. తిరుమల వ్యవహారంలో రాజకీయ ఆరోపణలు, విమర‌్శలు చేయడానికి అనుమతించమని ధర్మాసనం స్పష్టం చేసింది.దర్యాప్తు చేసిన తర్వాత దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామని ధర్మాసనం ప్రకటించింది. అయితే ఈ అంశంలో ఎలాంటి గడువును విధంచలేదు.
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు స్వాగతించారు. వైసీపీపై నిందలు మోపుతూ దుష్ప్రచారం చేశారని దీనిపై విచారణలో నిజాలు బయటకు వస్తాయన్నారు. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలతో పాలకమండలికి సంబంధం ఉండదని గుర్తు చేశారు. జూన్‌లో టీడీపీ వచ్చిన తర్వాత నెయ్యి సరఫరా జరిగిందని, దీనికి బాధ్యులెవరో విచారణలో తేలుతుందన్నారు. మొత్తంగా తిరుపతి లడ్డూ వ్యవహారంలో నిజానిజాలు బయటకు వస్తే పచ్చమంద పరిస్థితి ఏంటోనని అంతా చర్చించుకుంటున్నారు.