బెట్టింగ్ యాప్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది తెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీలో బెట్టింగ్ యాప్స్ అంశంపై ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు కోసం సిట్‌ను నియమిస్తున్నట్లు వెల్లడించారు.
ఇకపై గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించారు. గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం 2021లో ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై నిషేధం విధించినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటీవల రాష్ట్రంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు.
ఆన్‌లైన్ రమ్మీ వంటి ఇతర గేమ్‌లను నిషేధించడానికి స్పేషల్ ఇన్వెష్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాదు ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న వారికి విధించే శిక్షను పెంచేందుకు వచ్చే సమావేశాల్లో సవరణ బిల్లును సభలో ప్రవేశ పెడతామని ప్రకటించారు.
బెట్టింగ్ యాప్‌ల కేసులో ఉన్న వారి వివరాలను పరిశీలిస్తే.. రానా దగ్గుబాటి,ప్రకాష్ రాజ్,విజయ్ దేవరకొండ,మంచు లక్ష్మి,ప్రణీత,నిధి అగర్వాల్,అనన్య నాగళ్ల,
సిరి హనుమంతు,శ్రీముఖి,వర్షిణి సౌందరరాజన్,వసంతి కృష్ణన్,శోభా శెట్టి,అమృత చౌదరి,నయని పావని,నేహా పఠాన్,పండు,పద్మావతి,ఇమ్రాన్‌ఖాన్,విష్ణు ప్రియ,
హర్ష సాయి,బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల,టేస్టీ తేజ,రీతూ చౌదరి,బండారు సుప్రీత తదితరులు ఉన్నారు.
