అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు ఓ దుర్మార్గుడు. తీవ్ర గాయాల పాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఈ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడ్డ ఉన్మాది… కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ముఖ్య అనుచరుడు మురళీ కుమారుడు గణేష్. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న గౌతమిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడు టీడీపీ కార్యకర్త గణేష్.
గణేష్ తండ్రి మురళీకి టీడీపీ నేతలతో సత్సంబంధాలు. దాంతో రాజీ కోసం టీడీపీ నేతలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తుండగా ఆడబిడ్డపై యాసిడ్ పోసిన దుర్మార్గుడికి కూటమి నేతలు వత్తాసు పలుకుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న యువతికి పెళ్లి నిశ్చయం అయింది. ఏప్రిల్ 27న పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమోన్మాది గణేష్.. యువతి ముఖంపై యాసిడ్ పోసి రాక్షసానందం పొందాడు. ప్రస్తుతం బాధితురాలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.