కడప టీడీపీలో అసమ్మతి సెగ తారాస్థాయికి చేరింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త జిల్లా శ్రీనివాసులరెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా నిరసన చేపట్టారు టీడీపీ నేతలు. టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీగా సీనియర్ కార్యకర్తలు, నాయకులు సమావేశం నిర్వహించారు.
దేవునికడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు.. వెంకటేశ్వర స్వామికి వినతిపత్రం అందించారు.
ఆది నుండి టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తుందంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు. ఇటీవల పార్టీల చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను తొక్కేస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కమలాపురం సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డిని కలిసి… తమను గుర్తించి ఆదుకోవాలని కోరారు నాయకులు.
