Saturday, May 10, 2025
- Advertisement -

టీడీపీ.. గురివిందా నలుపెరగవా!

- Advertisement -

వై నాట్ 175 అన్న నినాదంతో దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత జగన్. ఇందులో భాగంగా పలువురు సిట్టింగ్‌లకు మొండి చేయి తప్పదని, పలువురికి స్థాన చలనం ఉంటుందని తేల్చి చెప్పారు. చెప్పినట్లుగానే 11 స్థానాలకు ఇంఛార్జీలను నియమించారు జగన్. ఇందులో ప్రధానంగా ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వుడు బాలసాని కిరణ్ కుమార్, కొండెపి ఎస్సీ రిజర్వుడు మంత్రి ఆదిమూలపు సురేష్, వేమూరు (ఎసీఎ) వరికూటి అశోక్ బాబు, తాడికొండ (ఎస్సీ) మేకతోటి సుచరిత, సంతనూతలపాడు (ఎస్సీ) మేరుగు నాగార్జున, చిలకలూరిపేట మల్లెల రాజేష్ నాయుడు, గుంటూరు పశ్చిమ విడదల రజని, అద్దంకి పాణెం హనిమిరెడ్డి, మంగళగిరి గంజి చిరంజీవి, రేపల్లె డాక్టర్ ఈవూరు గణేష్, గాజువాక డాక్టర్ వరికూటి రామచంద్రరావు ఉన్నారు.

ఇందులో ముగ్గురు మంత్రులకు స్థాన చలనం కలగగా కొందరు ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు జగన్. త్వరలోనే దాదాపుగా యాభై అసెంబ్లీ నియోజకవర్గాలలో కొత్త ముఖాలు కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ చేసిన ఈ మార్పుల నేపథ్యంలో టీడీపీ నేతలు విష ప్రచారానికి తెరలేపారు. ఓడిపోతామని తెలిసే మార్పులు చేపట్టారని తమ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.

అయితే గురువింద గింజ తన నలుపెరగదుగా అన్నట్టుగా టీడీపీ నేతల మాటలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఇలా సిట్టింగ్‌లకు స్థాన చలనం కలిగించింది టీడీపీ. కోడెలను నరసరావుపేట నుండి సత్తెనపల్లికి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అర్బన్ నుండి రూరల్, ఇక గంటా శ్రీనివాస్ రావు పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు ఆయన ఒకసారి పోటీ చేసిన స్థానం మళ్లీ పోటీ చేయలేదు. ఈసారి సైతం భీమిలీ నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అశోక గజపతి రాజును ఈ సారి పార్లమెంట్‌కు పంపే అవకాశాలున్నాయి.

అలాగే చాలా మంది ఎమ్మెల్యేలను ఎంపీగా పోటీ చేయించారు చంద్రబాబు. ఇలా పార్లమెంట్‌కు వెళ్లిన వారిలో ఎర్రం నాయుడు ఉన్నారు. 2019 లో అనితని పాయకరావు పేట నుండి కోవూరుకు , జవహర్ ని కోవూరు నుండి తిరువూరుకు , అద్దంకిలో ఉండే కరణంని చీరాలకు డోన్‌లో ఉండే కేఈని పత్తికొండకు, కోట్ల కుటంబాన్ని ఆలూరుకు , జమ్మలమడుగులో ఆది ని కడప పార్లమెంట్ ను , గన్నవరం నుండి గద్దె ని బెజవాడ కి ఇలా చాలా మంది నేతలను మార్చారు. అందుకే టీడీపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే వారు చేస్తే సంసారం .. పక్కన వాడు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసిన జగన్ మాత్రం చాలా దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు . బడుగు బలహీన వర్గాలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ఈసారి ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -