అనేక తర్జన భర్జనల అనంతరం తెలంగాణ బీజేపీ థర్డ్ లిస్ట్ రిలీజైంది. 35 మందితో మూడో జాబితాను రిలీజ్ చేయగా ఉప్పల్ నుండి ప్రభాకర్, జూబ్లీహిల్స్ నుండి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక అలాగే అంబర్ పేట నుండి కిషన్ రెడ్డి స్థానంలో కృష్ణ యాదవ్ కు సీటు దక్కగా అందోల్ సీటును బాబు మోహన్‌కు కేటాయించారు. ఇక రెండు రోజుల ముందే బీజేపీ నేతలపై బాబు మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తాను ఫోన్ చేసిన బీజేపీ నేతలు లిఫ్ట్ చేయడం లేదని ఒక వేళ ఆందోల్ సీటు ఇచ్చినా పోటీ చేయనని చెప్పారు. దీంతో ఇప్పుడు మూడో జాబితాలో ఆయనకు చోటు దక్కగా పోటీ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. తొలి రెండు జాబితాల్లో 53 మంది పేర్లను ప్రకటించింది. ఇక పొత్తులో భాగంగా జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకారం తెలిపింది.
మంచిర్యాల-రఘునాథ్, ఆసిఫాబాద్-ఆత్మారామ్ నాయక్,బోధన్-మోహన్‌రెడ్డి, బాన్సువాడ-యెండల లక్ష్మీనారాయణ,నిజామాబాద్ రూరల్-దినేష్, మంథని-సునీల్‌రెడ్డి,మెదక్-విజయ్‌కుమార్, నారాయణఖేడ్-సంగప్ప, జహీరాబాద్-రాజనర్సింహ,ఎల్బీనగర్-సామ రంగారెడ్డి,రాజేంద్రనగర్-శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల-KS రత్నం,పరిగి-మారుతీ కిరణ్, ముషీరాబాద్-పూసరాజు, సనత్‌నగర్-మర్రి శశిధర్‌రెడ్డిలకు చోటు దక్కింది.