టీడీపీ అధినేత చంద్రబాబు తలుచుకుంటే ఏదైన సాధ్యమే. అవసరం కోసం ఏదైనా చేస్తారు చంద్రబాబు. పలు సందర్భాల్లో ఇది నిజం కాగా తాజాగా టీడీపీ మూడో జాబితాలో చంద్రబాబు వైఖరి మరోసారి బయటపడింది. ఏకంగా బీజేపీ నేతకు టీడీపీ టికెట్ ఇచ్చారు. అది తెలంగాణ బీజేపీ నేతకు.
తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి,మాజీ డీపీజీ టి కృష్ణప్రసాద్‌ను బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. ఉమ్మడి ఏపీలో డీజీగా పనిచేశారు కృష్ణప్రసాద్. అయితే వరంగల్ ఎంపీ టికెట్‌ను ఆశీంచారు ఆయన. అయితే బీఆర్ఎస్ నుండి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరడగా ఆయనకు వరంగల్ టికెట్ దాదాపు కన్ఫామ్ అయినట్లే.

దీంతో కృష్ణప్రసాద్‌ను ఎవరూ ఉహించని విధంగా బాపట్లకు షిఫ్ట్ చేశారు. ఒక్కసారి టీడీపీ మూడోజాబితాలో ఆయన పేరు చూసి తెలుగుదేశం నేతలే కాదు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేశారు. ఇటీవల మోడీ బీజేపీకి వచ్చినప్పుడు కాషాయ కండువా కప్పుకుని ఆయనకు స్వాగతం పలికారు కూడా. అలాంటి బీజేపీ నేతకు టీడీపీ టికెట్ ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.