తెలంగాణ ఎన్నికల్లో పోటీచేస్తున్న జనసేనాని పవన్‌కు షాకిస్తున్నారు బీజేపీ నేతలు. తెలంగాణ ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ చేస్తోంది బీజేపీ. ఇందులో ప్రధానంగా కూకట్ పల్లి ఒకటి. ఇదే స్ధానం నుండి బీజేపీ నేతలు పోటీ చేసేందుకు చివరి వరకు తీవ్రంగా ప్రయత్నించారు కానీ పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు. ఇక ఇక్కడివరకు బాగానే ఉన్న జనసేన అభ్యర్థికి మద్దతిచ్చేందుకు నిరాకరిస్తున్నారు బీజేపీ నేతలు.
కూకట్ పల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకే మద్దతు ప్రకటిస్తున్నారు. ఒక కూకట్‌పల్లే కాదు మిగితా నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్‌కే అంతర్గతంగా జై కొడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్‌కు మద్దతివ్వడం ద్వారా కాంగ్రెస్‌కు బ్రేక్‌లు వేయోచ్చని భావిస్తున్నారట కాషాయ నేతలు.
తెలంగాణలో ట్రయాంగిల్ పోటీ జరుగుతుందని తొలుత భావించిన ఈ పోరులో బీజేపీ వెనుకబడే పోయింది. ఇక బీజేపీని నమ్ముని బరిలోకి దిగిన పవన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. ఆ పార్టీ పోటీచేస్తున్న స్థానాల్లో డిపాజిట్ దక్కడం కష్టంగా మారింది. దీంతో పవన్ సైతం బీజేపీ నేతల తీరుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.