2024-25 సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రూ. 2 లక్షల 75 వేల 891 కోట్లతో బడ్జెట్‌ని ప్రవేశ పెట్టగా ఆరు గ్యారంటీల అమలుకు పెద్ద పీట వేశారు. ఇక రైతు బంధు సాయంలో మార్పులు చేస్తామని ప్రకటించారు భట్టి. అలాగే ధరణి ద్వారా చాలా మంది ప్రజలకు అన్యాయం జరిగిందని…దీనిని సవరిసత్తామన్నారు.
బడ్జెట్ హైలైట్స్..
()రూ.2,75,891 లక్షల కోట్లతో బడ్జెట్
()ఐటీ శాఖకు రూ.774 కోట్లు
()పంచాయితీ రాజ్ శాఖకు 40,080 కోట్లు
()పురపాలక శాఖకు 11 వేల 692 కోట్ల రూపాయలు
()ఎస్సీ సంక్షేమానికి 21 వేల 874 కోట్లు
()ఎస్టీ సంక్షేమానికి 13 వేల 313 కోట్లు
()మైనార్టీ సంక్షేమానికి 2 వేల 262 కోట్లు
()బిసి సంక్షేమానికి 8 వేల కోట్లు
()బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు
()వ్యవసాయానికి 19 వేల 746 కోట్ల రూపాయలు
()విద్యా రంగానికి 21 వేల 389 కోట్ల రూపాయలు
()ఉన్నత విద్య, మౌలిక సదుపాయాలకు రూ. 500కోట్లు
()వైద్య, ఆరోగ్య రంగానికి 11 వేల 5 వందల కోట్ల రూపాయలు
()తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు
()యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు
()విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు.
()విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు.
()నీటి పారుదల శాఖ కు 2,8024 కోట్లు
()గృహ నిర్మాణానికి 7,740 కోట్లు.
()ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు.
()మూసీ సుందరీకరణ, అభివృద్ధికి 1000కోట్ల బడ్జెట్
()TSPSC నిర్వహణకోసం 40 కోట్ల రూపాయలు
()త్వరలోనే మెగా డీఎస్సీ ఉంటది
()త్వరలో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేసి, నియామక పత్రాలు ఇస్తాం