తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైందా?, కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?,ఉగాది రోజున మంత్రివర్గ విస్తరణ ఉంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
వాస్తవానికి కేబినెట్ విస్తరణపై ఎప్పటినుండో ప్రచారం జరుగుతోండగా ప్రతీసారి వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా మాత్రం కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖారారుకాగా ఖాళీగా ఉన్న ఆరు మంత్రివర్గ స్థానాల్లో నాలుగు శాఖలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకునే వారిలో సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, బీసీ కోటాలో శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్‌కు,ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మైనారిటీలకు అవకాశమిస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.
అలాగే త్వరలోనే తెలంగాణ పీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా వెలువడనుండగా తొలి విడతలో నలుగురు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, 20 మందికిపైగా వైస్ ప్రెసిడెంట్‌లను ప్రకటించనున్నారు. నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉంది.
తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. మంత్రి పదవి వస్తుందనే అనుకుంటున్నా. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలి. భువనగిరి పార్లమెంట్ బాధ్యతలు ఇస్తే సమర్థవంతంగా నిర్వహించా. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తా, ప్రజల పక్షాన నిలబడతా అన్నారు.