- Advertisement -

డీలిమిటేషన్‌పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య

- Advertisement -

నియోజకవర్గాల పునర్విభజనపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. కేంద్రంతో అంతర్గతంగా మాట్లాడుతున్నారు అన్నారు.

ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడకూడదు అన్నారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు నుంచి చాలా క్రమశిక్షణ పాటించాయి..ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదు అని కామెంట్ చేశారు.

డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించేది… జనాభా ఆధారంగా పార్లమెంటరీ సీట్ల సంఖ్యను నిర్ణయించడం సరికాదు అని తెలిపారు. ఎంపీలు పార్లమెంట్లో గళం విప్పాలని, అనంతరం ప్రజా పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే జేఏసీ సమావేశాన్ని నిర్వహించి, డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరిన్ని రాష్ట్రాలు కూడా ఇదే దిశగా స్పందించనున్న సూచనలు కనిపిస్తున్నాయి.

డీలిమిటేషన్ అనేది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ. జనాభా గణాంకాల ఆధారంగా పార్లమెంటరీ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల ఆధారంగా చేపడతారు. 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం జనాభా నియంత్రణను ప్రోత్సహించేందుకు డీలిమిటేషన్‌ను నిలిపివేసింది. 2002లో మరోసారి ఈ నిషేధాన్ని 2026 వరకు పొడిగించారు.

2026 తర్వాత కొత్త డీలిమిటేషన్ జరగనున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే, ఉత్తరాది రాష్ట్రాలకు అధిక పార్లమెంట్ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందని వాదన వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -