- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌..పదవుల జాతర!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌ బలోపేతంపై దృష్టి సారించింది కాంగ్రెస్. ఈ మేరకు పార్టీ పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా కీలక పదవులన్నీ భర్తీ చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. పదిరోజుల శిక్షణ కార్యక్రమం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, నిర్దిష్ట తేదీల్లో పేర్లు ఖరారు చేసి పంపించాలని ఆదేశించింది.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీలోగా డీసీసీ కార్యవర్గం, మండల మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలి. అనంతరం 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మండల, బ్లాక్ కాంగ్రెస్ కార్యవర్గాల ఖరారు ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు బూత్ లెవల్ మరియు గ్రామ పంచాయతీ స్థాయిలో అధ్యక్షులు, కార్యవర్గాల నియామకాలు పూర్తి చేయాలని నిర్ణయించారు.

పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమన్వయం అవసరమని భావించిన నాయకత్వం, ఈ నియామకాలను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేడర్‌ను చురుకుగా మారుస్తూ, కార్యాచరణను క్రమబద్ధీకరించడమే ఈ షెడ్యూల్ లక్ష్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -