అంతా అనుకున్నట్లే జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముసుగు తొలగించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి తన కుటిల బుద్దిని చాటుకున్నారు. తెలంగాణలో టీడీపీ పోటీకి దూరమైనప్పటి నుండి ఆ పార్టీ ఎవరికి మద్దతిస్తుందా అన్న సందేహం అందరిలో నెలకొంది. అయితే రాజకీయాలపై కాసింత అవగాహన ఉన్నవారు ముందే చంద్రబాబు మద్దతెవరికో పసిగట్టేశారు. కానీ కొంతమంది మాత్రం టీడీపీ న్యూట్రల్‌గా ఉంటుందని భావించారు.
అయితే తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగియడంతో టీడీపీ కూడా ముసుగు తీసేసింది. కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచింది. చంద్రబాబు ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌కు అండగా నిలిచేందుకు చేసుకున్న చీకటి ఒప్పందం బయటపడింది. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు టీడీపీ నేతలు. కాంగ్రెస్ ర్యాలీలో సీపీఐ జెండాలతో పాటు టీడీపీ జెండాలు కూడా ఎగరడంతో అంత షాక్ అయ్యారు.
టీడీపీ సైతం కాంగ్రెస్‌కు మద్దతిచ్చిందా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇక్కడే బాబును ఇప్పుడు అందరూ అనుమానించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు అదే జనసేన తెలంగాణలో పోటీ చేస్తుంటే ఆ పార్టీకి మద్దతివ్వకుండా కాంగ్రెస్‌కు మద్దతివ్వడం జన సైనికులకు కూడా మింగుడు పడటం లేదు. చంద్రబాబు వైఖరి, విధానం ఏంటో తెలియక తికమకపడుతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో అది పవన్ పార్టీకి ఏ మేరకు లాభం చేకూరుతుందో కానీ టీడీపీ మాత్రం జనసేనతో లబ్ది పొందడం ఖాయమనే టాక్ మాత్రం నడుస్తోంది.