Saturday, May 3, 2025
- Advertisement -

ఉరవకొండ..సరికొత్త టెన్షన్!

- Advertisement -

ఏపీలో ఇప్పుడు ఎన్నికల ఫలితాలపై ఎంత ఆసక్తి నెలకొందో కొన్ని స్థానాల్లో గెలుపు ఎవరిని వరిస్తుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే మరికొన్ని సీట్లలో ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదు. ఇదే సెంటిమెంట్ కొన్ని దశాబ్దాలుగా వస్తోంది. అదే అనంతపురం జిల్లా ఉరవకొండ.

టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బరిలో ఉండగా వైసీపీ నుండి విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 1999లో టీడీపీ అభ్యర్ధిగా ఉరవకొండ నుంచి పోటీ చేసిన కేశవ్ ఓటమి పాలుకాగా 2004,2009, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక 2004 నుండి పోటీ చేస్తూ వస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి తొలిసారి 2014లో విజయం సాధించారు.

ఇక ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదు. ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు ఎవరిది అనేదానిపైనే అందరి దృష్టి ఉంది. పయ్యావుల కేశవ్ స్థానికంగా మంచి పట్టు ఉన్న వ్యక్తి. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా విశ్వేశ్వర్ రెడ్డి సైతం స్థానికంగా బలమైన నాయకుడు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా ఈసారి గెలుపు తనదేనని చెబుతున్నారు. అయితే వీరిద్దరిలో ఎవరు గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి ఈసారి ఉరవకొండ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -