టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే టీడీపీతో పొత్తుకు జనసేన,బీజేపీ వెనుకడుగు వేస్తుండగా పార్టీని ముందుకు నడిపించేవారేవరు ఎవరు అనే దానిపై తెలుగు తమ్ముళ్లలో చర్చనడుస్తోంది.ఎందుకంటే అమరావతి నిర్మాణంలో అవినీతి, ఫైబర్ నెట్ అవినీతి కేసులో చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు పేరు కూడా ఉండటంతో వీరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇక చంద్రబాబు అరెస్ట్‌తో ఆయనకు తగిన శాస్త్రి జరిగిందని టీడీపీలోని ఓవర్గం భావిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు అంటేనే గుర్తుకొచ్చేది వెన్నుపోటు. సీనియర్ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన సీఎం ఎలా అయ్యారో చెప్పాల్సిన పనిలేదు. బాబు రాజకీయ జీవితంలో ఉన్న పెద్ద మచ్చ ఇది. ఇక తర్వాత హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ని సైతం తన రాజకీయాలకు వాడుకుని అవసరం తీరాక దూరం పెట్టారు చంద్రబాబు.
ఈ నేపథ్యంలో టీడీపీలోని ఓ వర్గం కట్టిన ఫ్లెక్సీలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. నందమూరి తారకరామారావు పేరుతో వెలిసిన ఫ్లెక్సీలో థాంక్యూ జగన్ నా ఆత్మకు శాంతి చేకూర్చావు అంటూ రాసుకొచ్చారు. నన్ను చివరి దశలో అనేక అవమానాలకు, అత్యంత క్షోభకు గురిచేసి నా మరణానికి కారణమైన నీచుడు చంద్రబాబు..నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకొని నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా వీడి కుటిల రాజకీయాలకు వాడకుని చివరికి నా వారసుడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కొడుకు నీచరాజకీయానికి వాడుకున్న నీచుడికి బుద్దిచెప్పి, నా ఆత్మకు శాంతిచేకూర్చావు నీచుడు, దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ 10న జైలుకెళ్లిన సందర్భంగా ఆత్మ శాంతి దినోత్సవంగా జరుపుకోవాలని నా విజ్ఞప్తి అంటూ ఫ్లెక్సీలు వెలియగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇక చంద్రబాబు అరెస్ట్‌తో ఇప్పుడు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీని లీడ్ చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే సరైన వాడని భావిస్తున్నారు టీడీపీ నేతలు.అయితే ఫ్లెక్సీల పేరుతో జరుగుతున్న రాజకీయంపై చంద్రబాబు వర్గం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి..