మాట ఇస్తే వెనక్కి తగ్గని నైజం ఆ కుటుంబానిది. మరీ ముఖ్యంగా వైఎస్ ఒకసారి మాట ఇచ్చారంటే దానిని వెనక్కి తీసుకొరు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ఇక అదే బాటలో జగన్ సైతం ఒక్కసారి మాట ఇస్తే మడమతిప్పడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఓదార్పు యాత్రే. వైఎస్ అకాల మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పుయాత్ర చేపట్టారు జగన్. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ దానిని ఒప్పుకోలేదు. మాట ఇచ్చాక తగ్గేది లేదని జగన్ ముందుకే వెళ్లడంతో ఆయనపై అనేక కేసులు,జైలు పాలు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు వినమని వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నవారు చెప్పినా వెనక్కి తగ్గలేదు. అదే జగన్‌ని ప్రజల ముందు లీడర్‌గా నిలబెట్టి వైఎస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకురావడానికి తోడ్పడింది.
మాట ఇస్తే ఎలా తప్పడో మాట వినని వారిపట్ల అంత కఠినంగానే ఉంటారని జగన్ సన్నిహితులు చెబుతుంటారు. తాను చెప్పదలుచుకుంది సూటిగా,స్పష్టంగా చెప్పడమే జగన్‌కు ఉన్న ప్లస్, మైనస్ పాయింట్. అయితే రాజకీయాల్లో దీనివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉన్నా తన వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోలేదు జగన్.
అందుకే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో కొంతమంది సీనియర్లు అలకపాన్పు ఎక్కినా వారికి నచ్చజెప్పి ఒప్పించడంలో జగన్ స్టైలే వేరు. ఇక తాజాగా కొంతమంది సిట్టింగ్‌లకు సీట్లు రావని చెబుతూనే రాని వారు నిరాశ చెందవద్దని తాను ఉన్నానని ధైర్యం ఇవ్వడంలో జగన్‌కు మరెవరూ సాటిరారు. తన ముందున్న లక్ష్యం వైనాట్ 175 మాత్రమేనని ఎమ్మెల్యేలకు చెప్పిన జగన్..అంతా ప్రజల్లో ఉండాలని సూచించారు.
ఇక జగన్‌కు చంద్రబాబుకు మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. చాలామందికి టికెట్ల విషయంలో స్పష్టంగా హామీ ఇవ్వరు బాబు. అలా అనీ టికెట్ దక్కదని చెప్పరు. కట్టె విరగదు..పాము చావదు అన్నట్లు…టికెట్ కోసం వచ్చిన ప్రతినేతకు జాగ్రత్తగా పనిచేసుకోండి టికెట్ విషయం తనకు వదిలిపెట్టేయండని చెబుతుంటారు. దీంతో టికెట్ తమకేననే భ్రమలో ఉండే ఆ ఆశావాహులు నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేస్తారు. తీరా టికెట్ ఇచ్చే సమయానికి సీన్ మొత్తం మారిపోతుంది. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో ఒకడుగు ముందే ఉంటారు. తాను ఎవరికి టికెట్ ఇవ్వదలుచుకున్నానో చెప్పడమే కాదు బుజ్జగింపులోనూ న్యాయం చేస్తానని హామీ ఇస్తే చాలు ఆ నేతకు ధైర్యం వచ్చినట్లే. ఒకవేళ జగన్ చెప్పినా వినకపోతే వారిని వదిలించుకునేందుకు వెనుకాడరు.
ఇందుకు ప్రత్యఈమధ్యనే ఇటీవల జరిగిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలు. వాస్తవానికి ఎమ్మెల్యే కోటాలో ఏడుకు ఏడు సీట్లు గెలవాల్సింది వైసీపీనే. కానీ కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో వారిని బుజ్జగించే పనిచేయలేదు జగన్. ముక్కు సూటిగా ఉండగా క్రాస్ ఓటింగ్ వల్ల ఒక సీటులో ఓడిపోయింది. సీటును ఓడిపోవటానికైనా సిద్ధపడ్డారే కానీ వారిని బుజ్జగించి డ్రామా ప్లేచేయటానికి ఇష్టపడలేదు. ఇదే జగన్ స్టైల్.