Saturday, May 10, 2025
- Advertisement -

నానికే పంచ్‌ ఇచ్చిన ఆ హీరోయిన్‌!

- Advertisement -

టాలీవుడ్‌లో సహజనటి జయసుధ అయితే సహజ నటుడు నాని. అష్టాచమ్మ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయినా నాని.. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. నానితో సినిమా అంటే గ్యారెంటీ హిట్ అనేలా పేరు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా హిట్ 3తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన నాని…ఓ వైపు హీరోగా మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమాస్ పేరుతో సినిమాలను నిర్మిస్తున్నారు.

ఇక నాని సరసన నటించేందుకు హీరోయిన్లు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం నానితో సినిమాకు నో చెప్పేసిందట. అది ఒక్క సారి కాదు మూడుసార్లు. ఇంతకీ ఆ నటి ఎవరనుకుంటున్నారు రష్మికా మందన్న. ఛలో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ దక్షిణాదిన అగ్రహీరోయిన్‌గా ఉంది.

ఈ నేపథ్యంలో నానితో మూడు సినిమాల్లో ఆఫర్ రాగా దానిని తిరస్కరించిందట. ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది గాసిపేనా లేదా నిజంగానే రష్మికా… నానితో సినిమా ఆఫర్‌ను తిరస్కరించిందా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -