Friday, May 9, 2025
- Advertisement -

తగ్గనున్న సెల్‌ఫోన్ ధరలు..బడ్జెట్‌లో పెరిగే,తగ్గే వస్తువులివే!

- Advertisement -

2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్‌లో ఏపీ, బీహార్ రాష్ట్రాలకు పెద్ద పీట వేయగా బంగారం, వెండి,ప్లాటినం వంటి వాటిపై భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. అలాగే మూడు ర‌కాల క్యాన్స‌ర్ మందులు, మొబైల్ ఫోన్లు, ఛార్జ‌ర్లు వంటి వాటిపై సుంకాన్ని తగ్గించగా ప్లాస్టిక్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచారు.

బడ్జెట్ ప్రకారం తగ్గే వస్తువుల వివరాలను పరిశీలిస్తే లెద‌ర్ గూడ్స్ , సీఫుడ్‌, ఎక్స్ రే ట్యూబ్‌లు, రొయ్య‌లు, ఫిష్ ఫీడ్‌, ఉక్కు, రాగి, సోలార్ సెల్స్‌-ప్యాన‌ళ్ల త‌యారీకి అవ‌స‌ర‌మైన వ‌స్తువులు, 25 ర‌కాల క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్‌, సెల్‌ ఫోన్, సెల్‌ఫోన్ ఛార్జర్ ధరలు భారీగా తగ్గనున్నాయి.

ఇక పెరిగే వస్తువుల వివరాలను పరిశీలిస్తే ప్లాస్టిక్ ఐట‌మ్‌లు, పీవీసీ ఫ్లెక్స్ బ్యాన‌ర్లు, సోలార్ గ్లాస్‌, టిన్డ్ కాప‌ర్ ఇంట‌ర్‌క‌నెక్ట్‌, అమ్మోనియం నైట్రేట్ ఉన్నాయి.అమ్మోనియం నైట్రేట్‌పై 10 శాతం, బయోడిగ్రేడబుల్ సాధ్యంకాని ప్లాస్టిక్‌పై 25 శాతం మేర కస్టమ్స్ సుంకాన్ని పెంచింది కేంద్రం. దీంతో టెలికం పరికరాలు భారీగా పరగనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -