- Advertisement -

కేసీఆర్‌పై మంత్రి వాసంశెట్టి అనుచిత వ్యాఖ్యలు

- Advertisement -

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఒక మంత్రి స్థాయిలో ఉండి, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసభ్యంగా, అగౌరవంగా మాట్లాడటంపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ గద్ద ముక్కు, వాడు, వీడు, గద్ద ముక్క పంతులుగాడు… గద్ద ముక్క గాడు అంటూ నీచంగా మాట్లాడారు వాసంశెట్టి. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా, కేసీఆర్‌పై బాడీ షేమింగ్ (శరీర రూపంపై వ్యాఖ్యలు) చేయడంపై వారు మండిపడుతున్నారు.

టీడీపీ నాయకులు పక్కవారికి నీతులు చెప్తారు, కానీ వారు మాత్రం ఎవరినైనా ఎన్ని బూతులు అయినా తిట్టవచ్చా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సంస్కారం గురించి మాట్లాడే టీడీపీ, తమ మంత్రిని ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఎలా సమర్థిస్తుందని ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -