Thursday, May 8, 2025
- Advertisement -

వెలిగొండ ప్రాజెక్టు..విశేషాలివే

- Advertisement -

ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కల నేడు సాకారం కాబోతుంది. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ ను జాతికి అంకితం ఇవ్వనున్నారు సీఎం జగన్. 2004లో జలయజ్ఞంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పశ్చిమ ప్రాంతానికి వెలిగొండ ప్రజెక్ట్ కేటాయించారు.

2005 అక్టోబరులో శిలాఫలకం వేయగా సహజసిద్ధంగా ఏర్పడిన కొండల నడుమఉన్న సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద మూడు వాటర్ స్టోరేజ్ పాయింట్ల వద్ద కాంక్రీట్ డ్యాముల నిర్మాణం చేశారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన హెడ్ రెగ్యూలేటర్ ఏర్పాట్లు 2018లో పూర్తయ్యాయి.జర్మనీ నుండి దిగుమతి చేసుకున్న అత్యాధునిక టన్నెల్ బోరింగ్ మిషన్ల (టీబీఎం) సహాయంతో తవ్వకాలు చేశారు.

వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ను నవంబర్ 2021లో, రెండో టన్నెల్ ను జనవరి 2024లో పూర్తయింది.ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలైన 30 మండలాల్లో 15.25 లక్షల జనాభాకు త్రాగునీరు, 4లక్షల 47వేల 300 ఎకరాలకు సాగునీరు ప్రాజెక్టు ద్వారా అందించనున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 10,010.54 కోట్లు. ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని 30 మండలాలకు లబ్ధిచేకూరనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -