అమరావతేనా..విశాఖ మీద ప్రేమేది!

ఏపీ సీఎం చంద్రబాబుపై తనదైన శైలీలో ప్రశ్నల వర్షం కురిపించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. సీఎం చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

చంద్రబాబు చూపుతున్న వివక్ష అందరికి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!. విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పే మాటలు ఉత్త డాబు అని తెలిపోయిందన్నారు. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుందన్నారు. అమరావతి మీద ఉన్న ప్రేమ.. ఆదాయాలు తెచ్చిపెట్టే మిగిలిన నగరాలపై లేకపోవడం చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు.