- Advertisement -
ఏపీ పోలీస్ అధికారుల తీరును తప్పుబట్టారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని . గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్‌కి వచ్చి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ బూటు కాలితో తన్ని దుర్భాషలాడాడని మండిపడ్డారు.
రాయలేని భాషలో ఆయన మాట్లాడారని పేర్నినాని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డిని రెడ్డి కులం పేరుతో డీఎస్పీ అక్కడ దూషించారని మండిపడ్డారు. కార్యకర్త భోరున ఏడ్చారని కృష్ణా జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు పేర్ని నాని అన్నారు. జగన్ మీరు కలిసి చంద్రబాబుది ఏమైనా చీ..తారా, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ రాయలేని భాషలో తిట్టారంటూ మండిపడ్డారు పేర్ని నాని.
