Saturday, May 3, 2025
- Advertisement -

చంద్రబాబు ఒప్పుకున్న నిజం ఇదొక్కటే!

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు నోట నిజాలు వచ్చేది చాలా అరుదు. ఒకవేళ అలా వచ్చాయంటే అది ఖచ్చితంగా రాసిపెట్టుకోవాల్సిన రోజే. తాజాగా విజయవాడలో పర్యటించిన చంద్రబాబు.. వరద బాధితులకి సాయం చేయలేకపోతున్నామని ఒప్పుకున్నారు. స్వయంగా చంద్రబాబు నోటి వెంట ఈ మాటలు వచ్చాయి.

మీడియాతో మాట్లాడుతూ..వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీలో మేము ఫెయిల్ అయ్యాం అని చెప్పుకొచ్చారు బాబు. 80వేల కుటుంబాలకు పంపిణీ చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయాం… కేవలం 15వేల కుటుంబాలకే పంపిణీ చేయగలిగాం అని తెలిపారు. కొన్ని సమస్యలు ఎదురు కావడం వలన చేయలేకపోయాం 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత చెప్పడం విశేషం.

అలాగే జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌ని అందరి ముందు చులకన చేసి మాట్లాడారు చంద్రబాబు. ఇద్దరి మధ్య కాసేపు హాట్‌హాట్‌గా మాటల యుద్ధం జరిగింది. సీఎం, మంత్రుల కుమ్ములాటలు తో బాధితులకు ఆకలి రాత్రులు తప్పలేదు. స్వయంగా చంద్రబాబుతోనే తమకు సరుకులు అందలేదని వరద బాధితులు చెప్పడంతో అవాక్కయ్యారు టీడీపీ నేతలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -