Thursday, May 8, 2025
- Advertisement -

కోటంరెడ్డికి భంగపాటేనా?

- Advertisement -

ఏపీ ఎన్నికల ఫలితాలు మరో వారం రోజుల్లో రానున్నాయి. గెలుపు ఏ పార్టీని వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొనగా ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల్లో విజయం ఎవరి వైపు ఉందోనని అంతా ఎదురుచూస్తున్నారు. అలాంటి నియోజకవర్గంలో ఒకటి నెల్లూరు రూరల్.

2014,2019లో వైసీపీ తరపున గెలిచారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలోకి జంప్ అయ్యారు. టీడీపీ తరపున కోటంరెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ తరపున ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు.

ఇక ఈ సారి విజయం తనదేనని, హ్యాట్రిక్ కొట్టి తీరుతానని కోటంరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ చేపట్టిస సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు ఆదాల. కోటంరె్డి టీడీపీలో చేరిన తర్వాత నియోజకవర్గానికి చాలా వరకు నిధులు తేవడంలో సక్సెస్ అయ్యారు. దీనికి తోడు మలిరెడ్డి బ్రదర్స్ వైసీపీలో చేరడం, జగన్ సంక్షేమం తన విజయానికి బాటలు వేస్తుందని ధీమాతో ఉన్నారు. అయితే ప్రచారం మాత్రం ఈ రెండు పార్టీల మధ్య నువ్వా,నేనా అన్నట్లు సాగగా ప్రజలు ఎవరికి జై కొట్టారన్నది జూన్ 4న తేలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -