- Advertisement -

ఆడవాళ్లు మీకు జోహార్లు

- Advertisement -

ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. మహిళా హక్కుల ఉద్యమం సాధించిన విజయాలను గుర్తించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు ఈ రోజు ముఖ్యమైన సందర్భంగా నిలుస్తుంది.

మహిళలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో చేసిన కృషిని గుర్తుచేస్తుంది. అలాగే మహిళలు ఇప్పటికీ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ప్రపంచ దృష్టికి తీసుకువస్తుంది. గత పోరాటాలను స్మరించుకుంటూనే సమాన హక్కులు, న్యాయం, నాయకత్వం కోసం మరింత చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ రోజు గుర్తు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత, మహిళా హక్కులపై అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలు, చర్చలు నిర్వహిస్తారు.

2026 సంవత్సరానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్…మహిళలు మరియు బాలికలందరికీ హక్కులు, న్యాయం, చర్యలు అనే భావనను ముందుకు తీసుకువెళ్లడం.

ఈ థీమ్ ప్రకారం మహిళల హక్కులు కేవలం చట్టాల్లో మాత్రమే ఉండకుండా, వాటిని రోజువారీ జీవితంలో కూడా సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు పురుషులతో పోలిస్తే కేవలం 64 శాతం చట్టపరమైన హక్కులు మాత్రమే ఉన్నాయని అంచనా.

మహిళలపై వివక్ష చూపే చట్టాలు, బలహీనమైన రక్షణ వ్యవస్థలు, హానికరమైన సామాజిక ఆచారాలను తొలగించి సమాన న్యాయం అందించాల్సిన అవసరాన్ని ఈ ఉద్యమం ప్రాధాన్యం ఇస్తోంది. భారత్‌లో కూడా మహిళల భద్రత, సమాన వేతనం, గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో మహిళలకు న్యాయం అందుబాటులో ఉండటం వంటి అంశాలు ఈ చర్చలో కీలకంగా ఉన్నాయి.

ప్రపంచ దేశాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా రాయబారుల వివరాలను పరిశీలిస్తే…

మువాన్‌పుయి సాయావి – న్యూజిలాండ్ (హై కమిషనర్)

నగ్మా మహమ్మద్ మాలిక్ – జపాన్ (రాయబారి)

అనితా శుక్లా – ఈక్వడార్ (రాయబారి)

దేవయాని ఖోబ్రగడే – కంబోడియా (రాయబారి)

స్వాతి విజయ్ కులకర్ణి – అల్జీరియా (రాయబారి)

కె. నందిని సింగ్లా – మౌరిషస్ (రాయబారి)

దేవయాని ఖోబ్రగడే – ట్యునీషియా (రాయబారి)

స్మితా పంత్ – ఉజ్బెకిస్తాన్ (రాయబారి)

నీలాక్షి సాహా సిన్హా – ఆర్మేనియా (రాయబారి)

వాణి రావు – ఇటలీ (రాయబారి)

నమ్రతా ఎస్ కుమార్ – లాట్వియా (రాయబారి)

రచితా భండారి – మాల్టా (హై కమిషనర్)

గ్లోరియా గాంగ్టే – నార్వే (రాయబారి)

నీతా భూషణ్ – పోలాండ్ (రాయబారి)

అపూర్వ శ్రీవాస్తవ – స్లోవాక్ రిపబ్లిక్ (రాయబారి)

ఈ మహిళా నాయకులు ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ప్రతినిధ్యం వహిస్తూ దేశ విదేశాంగ విధానాన్ని బలోపేతం చేస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -