ఏపీ ఎన్నికల ఫలితాలు మరో మూడు రోజుల్లో వెల్లడికానున్నాయి. 2019లో 151 అసెంబ్లీ 22 పార్లమెంట్ స్థానాలు సాధించి రికార్డు సృష్టించారు జగన్. జగన్ సునామీలో కొట్టుకుపోయింది టీడీపీ. ఇక రెండోసారి అంతకుమించిన స్థానాలు దక్కించుకునేలా ప్రణాళిక రెడీ చేసి ఎన్నికల క్షేత్రంలో దిగారు జగన్. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్ని జగన్ మరోసారి అధికారం దక్కించుకోవడం ఖాయమని చెబుతున్నాయి.
ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నా వైసీపీ ఖచ్చితంగా కొన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014లో వైసీపీ విజయం సాధించిన నియోజకవర్గాలు అన్నీ ఆ పార్టీకి కంచుకోటలు కాగా 2019 ఎన్నికల్లో సైతం 2014లో గెలిచిన మెజారిటీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇందులో ప్రధానంగా రాయలసీమలోని సీట్లు క్కువగా ఉండటం విశేషం.
ఈ నియోజకవర్గాల్లో మళ్లీ వైసీపీ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్‌పై నమ్మకం, వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు, వాళ్ల కుటుంబాలు, సంక్షేమ పథకాలు ఈ స్థానాల్లో వైసీపీని మరింత బలోపేతం చేశాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.