- Advertisement -
దేశవ్యాప్తంగా ఈవీఎంలతో ఎన్నికలపై సందేహాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ ద్వారా స్పందించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.
న్యాయం జరగడమేకాదు.. జరిగినట్లు కనిపించాలి. ప్రజాస్వామ్యం మనగలగడం మాత్రమే కాదు.. మనగలుగుతుందని నిస్సందేహంగా చాటాలని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని చెప్పారు. మనదేశంలో కూడా ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలి.. తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటే దిశగా మనంకూడా పయనించాలని సూచించారు. జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.