Thursday, May 8, 2025
- Advertisement -

ఆపరేషన్ సింధూర్.. దేశ పరిరక్షణకు ప్రతీక

- Advertisement -

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌.. దేశ పరిరక్షణకు ప్రతీక అన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ఈ చర్య దేశ భద్రతను కాపాడటంలో భారత సైన్యం తీసుకున్న గట్టి నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. దేశాధిపత్యం , ప్రజల భద్రత ఏ పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని జగన్ స్పష్టంగా చెప్పారు.

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్, దేశాన్ని ఉగ్రవాదం నుండి రక్షించడానికి తీసుకున్న ఓ కీలక అడుగుగా నిలిచింది. ఉగ్రవాదంపై గట్టి చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో జగన్ వ్యాఖ్యలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రజలను రక్షించటమే అత్యవసరం అని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం ఐక్యంగా ఉండాలని పిలుపిచ్చిన వైఎస్ జగన్, భారత సైన్యం చేపట్టిన చర్యకు తన మద్దతును ప్రకటిస్తూ, “జై హింద్” అంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. భారత సైన్యం చేపట్టిన ఒక ప్రాధాన్యత గల చర్య అని.. ఇది దేశ సార్వభౌమత్వాన్ని మరియు ప్రజల భద్రతను కాపాడేందుకు తీసుకున్న ధైర్యవంతమైన చర్య అని .. ఈ చర్య ద్వారా భారత సైన్యం దేశాన్ని మరియు ప్రజలను రక్షించాలనే సంకల్పాన్ని మరోసారి నిరూపించిందని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -