Saturday, May 3, 2025
- Advertisement -

మీరు చూపిన మార్గమే శిరోధార్యం:జగన్

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, ప్రజానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తండ్రి వైఎస్‌కు ఘన నివాళి అర్పించారు మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం అంటూ ఎక్స్ వేదికగా ఎమోషన్ అయ్యారు జగన్.

ప్రజలకు మంచి చేయడంలో మీరు చూపిన మార్గమే మాకు శిరోధార్యం అన్నారు. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు తమకు మార్గమని వెల్లడించారు. నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు.. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయని వెల్లడించారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. ప్రజల కోసం వారి క్షేమమే ధ్యేయంగా చివరి వరకు మా కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -