Saturday, May 3, 2025
- Advertisement -

పోలీసులతో దాడులా..మేం అధికారంలోకి వస్తే?

- Advertisement -

పోలీసులతో దాడులు చేయించడం సరికాదని తాము అధికారంలోకి వస్తే ఇలానే చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని హితవు పలికారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశమయ్యారు జగన్.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ధర్మం, న్యాయాలను పరిరక్షించకపోతే ఈ పదాలకు అర్థమే ఉండదని హితవు పలికారు. పోలీసులను ప్రయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పడటం సరికాదన్నారు.

ఎన్నికలప్పుడు సూపర్‌ సిక్స్‌ పేరుతో అడ్డగోలు హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీలను ఎగ్గొట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 నెలలు అయ్యిందని ఇప్పటివరకు ప్రజలకు చేసిన మంచేమి లేదన్నారు. ప్రభుత్వ స్కూళ్లు నాశనం అవుతున్నాయని, రానున్న ప్రభుత్వ స్కూళ్లు ఉంటాయా? లేవో? అన్న పరిస్థితి నెలకొందన్నారు. అబద్ధం, అవాస్తవం అనే పునాదుల మీద ఏర్పడిన ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు మన్నన సాగిందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -