ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ 5 వ జాబితా రిలీజ్ అయింది. మంత్రి బొత్స సత్యనారాయణ 5వ లిస్ట్ ను విడుదల చేయగా 5వ జాబితాలో 4 పార్లమెంట్, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించారు.
కాకినాడకు చలమలశెట్టి సునీల్,మచిలీపట్నంకు సింహాద్రి రమేష్ బాబు,నరసరావుపేటకు అనిల్ కుమార్ యాదవ్,తిరుపతి(ఎస్సీ)కి గురుమూర్తిని ఇంచార్జీగా ప్రకటించారు. ఇక అరకు అసెంబ్లీ స్థానానికి రేగం మత్స్యలింగం,అవనిగడ్డకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు,సత్యవేడుకు నూకతోటి రాజేశ్ ని ఇంఛార్జీగా నియమించారు.
ఇప్పటివరకు 58 అసెంబ్లీ, 10 లోక్ సభ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయగా తాజాగా 4 పార్లమెంట్, 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ప్రకటించారు. అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేశ్ ను మచిలీపట్నంకు, అవనిగడ్డకు సింహాద్రి చంద్రశేఖర్ ను అవనిగడ్డ అసెంబ్లీ ఇంఛార్జిగా ప్రకటించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న గురుమూర్తికే అవకాశం దక్కింది. గతంలో గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించగా తాజాగా మార్పు చేసి తిరుపతికే ఇంఛార్జీగా ప్రకటించారు.