Thursday, May 8, 2025
- Advertisement -

వైసీసీ 5వ లిస్ట్ వచ్చేస్తోంది!

- Advertisement -

ఏపీ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌లో జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. రెండోసారి గెలిచి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు సీఎం జగన్‌. ఇప్పటికే నాలుగు జాబితాల్లో అభ్యర్థులను మార్చగా త్వరలోనే ఐదో జాబితా విడుదల కానుంది.

ఇప్పటికే ఐదో జాబితాలో మార్పులు చేపట్టే ఎమ్మెల్యేలను తాడేపల్లి గూడెంకు పిలిచి చర్చిస్తున్నారు సీఎం జగన్. ఇక ఐదో లిస్ట్‌లో 15 మంది అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 58 అసెంబ్లీ, 10 ఎంపీ నియోజకవర్గాల్లో మార్పులు చేసింది వైసీపీ.

ఇక ఈసారి వచ్చే జాబితాలో ఎవరేఎవరి స్థానాలు మారుతాయోననే టెన్షన్ అందరిలో నెలకొంది. అయితే ఈ సారి జాబితాలో 15 మంది ఉంటారని తెలుస్తోండగా దీనిపై అఫిషియల్‌గా క్లారిటీ రావాల్సి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు జగన్. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల మార్పు చేపడతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -