ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ ఏడో జాబితా వచ్చేసింది. ఇప్పటివరకు పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మారుస్తు వచ్చిన జగన్..తాజా జాబితాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించారు. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఎడం బాలాజీ, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా కటారి అరవిందా యాదవ్ లను నియమించారు.
ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంఛార్జిగా ప్రస్తుతం ఆమంచి కృష్ణ మోహన్ ఉండగా వచ్చే ఎన్నికల్లో తాను పర్చూరు నుండి పోటీచేయనని తెలిపారు. తనకు చీరాల నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరగా పర్చూరు నియోజకవర్గానికి కొత్త ఇంచార్జ్ ని ప్రకటించారు. ఇక కొత్తగా ఇంఛార్జీగా వచ్చిన ఎడం బాలాజీ గతంలోనూ పర్చూరు వైసీపీ ఇంఛార్జిగా పని చేశారు.
ఇక కందుకూరులోనూ మార్పు తప్పదని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మహిధర్ రెడ్డి ఉండగా ఈసారి ఆయనను తప్పించి కటారి అరవిందా యాదవ్ కు అవకాశం ఇచ్చారు.